మహేశ్ ఎన్ని సినిమాల్లో డబుల్ రోల్స్ చేశాడో తెలిస్తే.. షాక్ అవుతారు?
on Aug 23, 2023
అటు చైల్డ్ ఆర్టిస్ట్ గానూ, ఇటు హీరోగానూ స్టార్ డమ్ చూసిన వైనం.. సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతం. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ.. అనతికాలంలోనే వెండితెరపై తనదైన ముద్ర వేశారు మహేశ్. ఒకవైపు వాణిజ్యాత్మక చిత్రాల్లో నటిస్తూనే.. అడపాదడపా ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక సినిమాల్లోనూ సందడి చేస్తున్నారు ఈ ఘట్టమనేని హ్యాండ్సమ్ హీరో.
ఇదిలా ఉంటే, ఇప్పటి టాప్ హీరోల్లో ఒకరిగా ముందుకు సాగుతున్న ఈ సెన్సేషనల్ స్టార్.. తన కెరీర్ మొత్తమ్మీద ఇప్పటివరకు 36 సినిమాల్లో నటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. వీటిలో కేవలం రెండే రెండు చిత్రాల్లో మాత్రమే ఇంతవరకు ద్విపాత్రాభినయం చేశారు. బాలనటుడిగా అభినయించిన 'కొడుకు దిద్దిన కాపురం' (1989)లో వినోద్, ప్రమోద్ అనే అన్నదమ్ముళ్ళ పాత్రల్లో కనిపించిన మహేశ్.. హీరోగా నటించిన 'నాని' (2004) కోసం క్లైమాక్స్ సీన్ లో తండ్రీకొడుకులుగా కాసేపు డబుల్ రోల్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఏదేమైనా.. 36 సినిమాల్లో కేవలం రెండే రెండు సార్లు మహేశ్ డ్యూయెల్ రోల్స్ లో దర్శనమివ్వడం అంటే ఒక రకంగా షాకింగ్ విషయమే మరి.
Also Read